సురేశ్‌ రైనా 50వ ‘సారీ’ | 50th instance Raina dismissed by a spinner in IPL | Sakshi
Sakshi News home page

సురేశ్‌ రైనా 50వ ‘సారీ’

Apr 30 2018 10:33 PM | Updated on Apr 30 2018 10:33 PM

50th instance Raina dismissed by a spinner in IPL - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా(4,745) అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత‍్యధిక సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటైన ఆటగాళ్ల జాబితాలో రైనా రెండో స్థానంలో నిలిచాడు.  సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైనా.. ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ పెవిలియన్‌ చేరాడు.

ఫలితంగా 50 సార్లు స్పిన్నర్లకే చేతికి చిక్కిన అప్రతిష్టను రైనా మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో రాబిన్‌ ఉతప్ప తొలి స్థానంలో ఉండగా, రైనా రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్‌ స్పిన్నర్లు, లెగ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో తలో 19 సార్లు పెవిలియన్‌కు చేరిన రైనా.. స్లో లెఫ్టార్మ్‌ బౌలింగ్‌లో 11 సార్లు ఔటయ్యాడు. చైనామన్‌ బౌలింగ్‌లో ఒకసారి పెవిలియన్‌కు చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement