నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆటలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాడు వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు మ్యాచ్ లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, రోజర్స్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ప్రస్తుతం 27 ఓవర్లలో 120 పరుగులతో ఆస్ట్రేలియా ఆట కొనసాగుతోంది. రోజర్స్ 93 బంతుల్లో 7 ఫోర్లు బాది (52), వార్నర్ కూడా అదే దూకుడుగా ఆడుతూ 74 బంతుల్లో 9 ఫోర్లు బాది 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇరువురి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.