భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 120.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది.
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 120.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్(14), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (117), వాట్సన్ (81) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇరువురి భాగస్వామ్యంలో తొలిరోజు నుంచి రెండోరోజు వరకూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆకాశమే హద్దుగా.. భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలు దాటించారు. స్మిత్ 208 బంతుల్లో 15 ఫోర్లు బాది 117 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్ 183 బంతుల్లో 7 ఫోర్లు బాది 81 పరుగులకే వెనుతిరిగాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు.