ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 113.3 ఓవర్లలో 415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 113.3 ఓవర్లలో 415 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మిత్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ వాట్సన్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా స్మిత్ అదే దూకుడును ప్రదర్శిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
స్మిత్ ఆడిన నాలుగు టెస్టు సిరీస్ లలో ఎనిమిదోవ సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. యాదవ్ బౌలింగ్ లో సహా కు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్ కు చేరాడు. రెండు రోజులు కలిపి 208 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 117 పరుగులకు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 116.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 416 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్(10), బర్న్స్ (0) క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, యాదవ్ తలో వికెట్ తీసుకోన్నారు.