టి20లో 313 పరుగుల విజయం | 313 target in T20 | Sakshi
Sakshi News home page

టి20లో 313 పరుగుల విజయం

Jan 15 2015 12:40 AM | Updated on Sep 2 2017 7:43 PM

ఓ టి20 మ్యాచ్‌లో 300 పరుగులు చేయడమే కష్టం. అలాంటిది ఓ జట్టు 313 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేస్తే ఆశ్చర్యమే. ఈ అద్భుతం షార్జాలో జరిగింది.

దుబాయ్: ఓ టి20 మ్యాచ్‌లో 300 పరుగులు చేయడమే కష్టం. అలాంటిది ఓ జట్టు 313 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేస్తే ఆశ్చర్యమే. ఈ అద్భుతం షార్జాలో జరిగింది. బుఖాతిర్ టి20 లీగ్‌లో భాగంగా యునికాన్ క్రికెట్ క్లబ్ 313 పరుగులతో ముసాఫిర్ క్లబ్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యునికాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 364 పరుగులు చేయగా... ముసాఫిర్ క్లబ్ 10.3 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌటయింది. క్రికెట్ రికార్డుల్లోకి ఇది చేరకపోయినా... క్లబ్‌స్థాయి క్రికెట్‌లో ఇంత పెద్ద విజయం అద్భుతమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement