ఇదొక వరస్ట్‌ ఇయర్‌: మంజ్రేకర్‌

2019 Worst Year For Me As Analyst And Commentator, Manjrekar - Sakshi

న్యూఢిల్లీ:  ఒక కామెంటేటర్‌గా, ఒక క్రికెట్‌ విశ్లేషకుడిగా ఈ ఏడాది(2019) తన చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందని అంటున్నాడు సంజయ్‌ మంజ్రేకర్‌. ఈ ఏడాది కచ్చితంగా తనకు ఒక ‘వరస్ట్‌ ఇయర్‌’ అంటూ పేర్కొన్నాడు. తాను కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయిన మాట వాస్తవేమనని ఏడాది ముగింపు సందర్భంగా తెలిపాడు. ప్రధానంగా సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై చేసిన కామెంట్‌ చాలా పెద్ద తప్పిదమని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. దీనికి హర్షా భోగ్లేను క్షమాపణలు కోరుతున్నట్లు మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో తన ఎమోషన్స్‌ అదుపు తప్పాయన్నాడు. తనన తాను కంట్రోల్‌ చేసుకోలేకపోవడం వల్లే హర్షా భోగ్లేతో ఘాటుగా మాట్లాడానని తెలిపాడు.

దీనికి క్షమించమని హర్షాభోగ్లేను కోరుతున్నట్లు మంజ్రేకర్‌ అన్నాడు. ఒక ప్రొఫెషనల్‌ కామెంటేటర్‌గా అలా మాట్లాడటం సరైన చర్య కాదన్నాడు.2019లో మంజ్రేకర్‌ తరచు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మంజ్రేకర్‌ దేనిపై వ్యాఖ్యానించినా అది విపరీతార్థంలో ఉండటంతో అతన్ని క్రికెట్‌ అభిమానులు ఆడేసుకున్నారు.  ఈ క్రమంలోనే హర్షా భోగ్లే పట్ల కూడా మంజ్రేకర్‌ దూకుడుగాప్రవర్తించాడు. 

నవంబర్‌ నెలలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌ బాల్‌ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరించిన మంజ్రేకర్‌.. సహచర వ్యాఖ్యాత హర్షా భోగ్లే చిన్నబుచ్చుకునేలా మాట్లాడాడు. పింక్‌ బాల్‌ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు. ప్రధానంగా బంతి ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే కానీ తెలియదని భోగ్గే పేర్కొన్నాడు. దీనికి వెంటనే స్పందించిన మంజ్రేకర్‌.. ఈ విషయం నువ్వే అడగాలి. ఏమో ఏదో సాధారణ క్రికెట్‌ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు’ అని మాట్లాడాడు. హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top