అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ | Steve Irwin's Son Shared A Photo With Crocodile | Sakshi
Sakshi News home page

అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ

Jul 5 2019 5:31 PM | Updated on Jul 5 2019 6:31 PM

Steve Irwin's Son Shared A Photo With Crocodile - Sakshi

అప్పుడు నాన్నా, నేను ముర్రేకు ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు అదే స్థలం, అదే మొసలి. కానీ, రెండు ఫోటోల నడుమ 15 సంవత్సరాల దూరం

ఆస్ట్రేలియా: స్టీవ్ ఇర్విన్.. జంతు ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. స్టీవ్ ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షుడిగా, ప్రముఖ టీవీకారునిగా (టెలివిజన్‌) ప్రపంచానికి సుపరిచితుడు. కానీ, అతను స్టింగ్రే ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయి విషాదం మిగిల్చాడు. స్టీవ్ మరణించే సమయంలో అతని కొడుకు రాబర్ట్ ఇర్విన్ వయసు కేవలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన రాబర్ట్ స్టీవ్‌..  బుధవారం తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. జంతు ప్రేమికులను ఈ పోస్ట్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాబర్ట్ తన తండ్రి మాదిరిగానే జూ యూనిఫాం ధరించి, అతనిలాగానే మొసలికి ఆహారం విసిరిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో పంచుకున్నాడు.

‘అప్పుడు నాన్నా, నేను ముర్రేకు ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు అదే స్థలం, అదే మొసలి. కానీ, రెండు ఫోటోల నడుమ 15 సంవత్సరాల దూరం’ అని ఫోటోకు శీర్షిక పెట్టాడు. రాబర్ట్ చేసిన పోస్ట్ తన తండ్రిని గుర్తు చేసిన కారణంగా వేలాది మంది ఉద్వేగానికి లోనయ్యారు. ‘నీ తండ్రి జీవించి ఉంటే ఎంత మురిసిపడేవారో..! రాబర్ట్‌’ అని ఆస్ట్రేలియా టీవీ ప్రజెంటర్ లిసా విల్కిన్సన్ పేర్కొనగా.. ‘నువ్వు అక్షరాల అతని అడుగుజాడల్లో నడవడం చూసి మీ నాన్న సంతోషించేవారు‘ అని నటి ఎమ్మీ పెర్రీ అన్నారు. కాగా, స్టీవ్ ఇర్విన్‌ ఇద్దరు పిల్లలు రాబర్ట్‌, బిందీ వన్యప్రాణి సంరక్షణకై సేవలందిస్తున్నారు. రాబర్ట్ వైల్డ్ లైఫ్ ప్రజెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ‘క్రైకీ ఇట్స్‌ ద ఇర్విన్‌’ రియాలిటీ షో- 2018లో ఇర్విన్‌ భర్యా, పిల్లలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement