రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌గా మారిన ఆర్సీబీ గర్ల్‌

RCB Fan Girl Goes Viral Overnight - Sakshi

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ గుర్తుందిగా.. ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే సూపర్‌ స్టార్‌గా మారిపోయింది. ప్రియా ప్రకాశ్‌లానే ప్రస్తుతం మరో అమ్మాయి కూడా ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారింది. ఆ వివరాలు.. ఐపీఎల్‌  టోర్నీలో భాగంగా గత శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ యువతి మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ యువతిని స్క్రీన్‌పై చూపించడంతో ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు.

ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. చివరకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ యువతి గురించి ట్విటర్ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు. ఈ అమ్మాయిని మన ప్రతీ మ్యాచ్ కు ఇన్‌వైట్ చేయాల్సిందేనంటూ కామెంట్ చేశాడు. దాంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ అమ్మాయి గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా ఆమె పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు.

#RCB girl forever ❤️🏏

A post shared by deepika (@deeghose) on

దాంతో ఒక్క రాత్రిలోనే ఈ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలవోర్ల సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. ఒక్క సారి తన ఫాలోవర్స్‌ పెరగడంతో ఈ యువతి కూడా తనను తాను ఆర్సీబీ గర్ల్‌గా ప్రకటించుకుంది. అంతేకాక తన పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్లను ఫాలో కావద్దని కోరింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో అభిమానులు సైతం తెగ ఆనందపడ్డారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top