అమెరికాలో ఏలియన్స్‌ కలకలం | Purple Beams And UFO In Phoenix Spark Conspiracy Theories | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఏలియన్స్‌ కలకలం

Apr 22 2018 2:50 PM | Updated on Apr 4 2019 3:25 PM

Purple Beams And UFO In Phoenix Spark Conspiracy Theories - Sakshi

అరిజోనా, అమెరికా : ఫోనిక్స్‌ నగర గగనతలంలో అర్థరాత్రి వింత వెలుతురు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కొండ ప్రాంతంలో ఓ వింత ఆకారంలోని వస్తువు ఎగరడాన్ని గమనించిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అది యూఎఫ్‌ఓ(అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌) అవునో.. కాదో అర్థం కావడం లేదని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. ముమ్మాటికి ఇది అమెరికన్‌ మిలటరీ పనే అని మరికొందరు అంటున్నారు.

కాగా, కొద్దిరోజులుగా ఏలియన్స్ భూమికి వచ్చి వెళ్తున్నాయన్న వార్తలు సోషల్‌మీడియాలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement