
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి సగుటూరు వద్ద 71వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఆయన ఇవాళ ఉదయం నాయుడుపేట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తుమ్మూరు, వెంకటగిరి క్రాస్, కొత్తపేట క్రాస్, పున్నేపల్లి, నెమళ్లపూడి వరకూ సాగింది. భోజన విరామం అనంతరం ఆయన ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించారు. ఆ తర్వాత మానవాళి క్రాస్ రోడ్డు, కర్రబల్లవోలు మీదగా వడ్డెపాలెం చేరుకున్నారు. అక్కడ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరణతో పాటు, పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. సగుటూరు వద్ద ఆయన పాదయాత్రను ముగించారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 951.3 కిలోమీటర్లు నడిచారు.