హోదా కోసం పోరాటం మరింత ఉధృతం

YSRCP MPs called on President RamNath, requesting his urgent intervention, tweets YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి.. లేఖ అందించారని ట్విటర్‌లో వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్రపతికి సమర్పించిన లేఖ ప్రతిని పోస్టు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top