ఈస్ట్‌, వెస్ట్‌ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ విజయ బావుటా!

 YSRCP  leading in West  and East Godawari  - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీ శరవేగంగా  దూసుకుపోతోంది.  రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ జోరుకు టీడీపీ కొట్టుకుపోతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో పాటు, ఈవీఎంల లెక్కింపులో మొదటి దశలో  విజయం దిశగా పయనిస్తోంది.  

రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, విజయనగరం, వైజాగ్‌ తదితర జిల్లాల్లో  ముందంజలో ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బోణీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో  వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో  పోలవరం,  పాలకొల్లు చింతలపూడి తదితర 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే  తూర్పుగోదావరి జిల్లాలో  అమలాపురం తదితర 10 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయ బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతోంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top