‘ఎన్నికలప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకొస్తారు’

YSRCP Leader C Ramachandraiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకి ప్రజలు గుర్తుకొస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే.. పథకాలను ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా మభ్యపెట్టే పథకాలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు.

ఎక్కడపడితే అక్కడ అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు.. తెచ్చిదంతా టీడీపీ నేతలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ద్రవ్యాన్ని సృష్టిస్తానని గోప్పలు చెప్పిన చంద్రబాబు.. మరి వేల కోట్లు అప్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, అణగారిన వర్గాలు అంటే చంద్రబాబు అసహ్యమని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంతా బూటకమన్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్రను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రను అవహేళన చేయ్యడం తగదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top