‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ | YSRCP Leader Anna Ramachandraiah Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’

Mar 14 2019 3:01 PM | Updated on Mar 14 2019 3:26 PM

YSRCP Leader Anna Ramachandraiah Fires On TDP Leaders - Sakshi

సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ బీసీ నాయకులు అన్నా రామచంద్రయ్య మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అన్నారు. బీసీ అనేవాడు భూములు కొనుగోలు చెయ్యకూడదా.. పైకి ఎదగకూడదా అని ప్రశ్నించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలు మెచ్చిన నాయకుడని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ కమిటీలు ఉన్నాయని, అందరం వైఎస్సార్‌ సీపీకే మద్దతు పలుకుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకి ధన్యవాదాలు తెలపాలని వెళితే.. తనను దారుణంగా అవమానించారని ఆవేదన ‍వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి బయటే రాత్రి 11:30 గంటల వరకు నిలబెట్టారన్నారు. ఇలా అనేక అవమానాలకు గురైయ్యామని, అందుకే టీడీపీకి రాజీనామా చేశామని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 15 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలను తాగుబోతులుగా చేస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం దుఖానాలకు లైసెన్సులు కేటాయించారన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ 27 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నా, ఆమరణ నిరాహార దీక్ష వరకు ఆ పార్టీలోనే ఉన్నా. తిరుపతిలోని టీడీపీ ఎమ్మెల్యేలందరి గెలుపుకోసం పనిచేశా.

మరి అప్పుడు నేను భూకబ్జాదారుడిగా కనపించలేదా.  మరి ఇప్పుడు వైఎస్సార్‌ సీపీలో చేరితే భూకబ్జాదారుడిగా అయ్యానా. బీసీలే మా వెన్నుముక అన్న చంద్రబాబు, బీసీలను దారుణంగా మోసం చేశారు. పీడీ యాక్ట్ పెట్టేది మీరే, దాన్నితొలగించేది మీరే.. ఇదెక్కడి న్యాయం. కార్యకర్తలతో ఎలా ప్రవర్తించాలో చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదు. నేను ఏ ఒక్క సెంటు భూమి కబ్జాచేశానని నిరూపించండి. నన్ను ఎదుర్కోలేక పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తారా. చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేస్తే ఎలా నమ్మ మంటారని’’ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement