గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా? | YSRCP Former MLA Vijay Prasad Slams On Minister Ganta Srinivasa Rao | Sakshi
Sakshi News home page

గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?

Sep 4 2019 12:09 PM | Updated on Sep 4 2019 12:57 PM

YSRCP Former MLA Vijay Prasad Slams On Minister Ganta Srinivasa Rao - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ హయాంలో వైఎస్సార్‌ సీపీ కుటుంబాలను ఇబ్బందులు పెట్టారని, చోడవరం, భీమిలి, అనకాపల్లి ప్రజలను వంచించిన ఘనత గంటాదని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంటా తప్పుడు రాజకీయాలకు శిక్షపడే సమయం దగ్గర పడిందని ఆయన అన్నారు. ఆయన ఎప్పుడైనా ప్రజలకు సేవ చేశారా అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి అవంతి శ్రీనివాసరావును విమర్శించే హక్కు ఎమ్మెల్యే గంటాకు లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ విధానాలకు అనుగుణంగా అవంతి నిజాయితీగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలకో పార్టీ, నియోజకవర్గం మారే గంటాను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. భీమిలీలో జనం తిప్పికొట్టడంతో ఉత్తర నియోజకవర్గానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడ మూడు నెలలుగా కనిపించడం లేదని జనాలు ఆగ్రహంతో ఉన్నారని , విశాఖలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న వ్యక్తి గంటా అని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement