వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

YS Jagan Mohan Reddy Tour Schedule Released - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ విడుదల అయింది. ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్‌ బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం గవర్నర్‌కు శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అలాగే సాయంత్రం అయిదున్నరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించనున్నారు. కాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top