ప్రజాసంకల్పయాత్ర.. 100 రోజులు | Ys Jagan Mohan Reddy Prajasankalpayatra completes 100 days | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్ప యాత్ర @ 100

Feb 28 2018 12:45 AM | Updated on Jul 25 2018 5:35 PM

Ys Jagan Mohan Reddy Prajasankalpayatra completes 100 days - Sakshi

ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : 

‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలి.  ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం దక్కేలా చూడాలి.  ప్రతి పేద బిడ్డా గొప్పగా చదవి పెద్దవాడిగా ఎదగాలి.  రైతన్నకు వ్యవసాయం పండుగ కావాలి. బడుగు బలహీన వర్గాల్లో బరోసా కల్పించాలి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోవాలి.  ఇదే నా కసి’  అంటూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. గతేడాది నవంబర్ ‌6న ప్రారంభమైన జననేత సుదీర్ఘయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. 

‘‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాకున్నది ఒక్కటే కసి... నేను చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి. ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి. ఆ కసి నాలో ఉంది కాబట్టి ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను’’  తొలి రోజు పాదయత్రలో వైఎస్‌ జగన్‌

‘నేను వేసే ప్రతి అడుగులో మీ అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశ్వీరాదాలు.. నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి.’’ - వెయ్యి కి.మీ పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

♦ రోజులవారిగా జగన్‌ పాదయాత్ర మైలురాళ్లు

100వ రోజు :  ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఉప్పలపాడులో ప్రారంభం, (ఫిబ్రవరి 28, 2018)
50వ రోజు : చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎంనుంచి ప్రారంభం.. జమ్మిలవారిపల్లిలో ముగింపు (జనవరి 2, 2018)
25వరోజు : కర్నూల్‌ జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం, మదనాంతపురంలో ప్రారంభం.. చెరువు తొండలో ముగింపు (డిసెంబర్‌3, 2017)
తొలి రోజు : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభం (నవంబర్‌ 6, 2017) 

♦ కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు 
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017) 
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)

 పాదయాత్రలోని ప్రతి మైలురాయికి గుర్తుగా జననేత వైఎస్‌ జగన్‌ మొక్కను నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement