మామిడి తాండ్ర తయారీదారులను కలిసిన వైఎస్‌ జగన్‌

YS Jagan Meets To Mamidi Tandra Makers In Atreyapuram - Sakshi

సాక్షి, కొత్తపేట : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఆత్రేయపురం శివారులో మామిడితాండ్ర తయారీదారులను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజన్న బిడ్డకు వినతిపత్రం అందజేశారు. 

కోల్డ్‌ స్టోరేజ్‌లు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని జననేతకు చెప్పారు. అంతేకాక జీఎస్టీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని మామిడితాండ్ర తయారీదారులు వైఎస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలను విన్న ప్రతిపక్షనేత సానుకూలంగా స్పందించారు. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top