యాదవ సత్రానికి పదెకరాలు ఇవ్వండి | Yadav Samithi Requests 10 Acres for Yadava's Satram | Sakshi
Sakshi News home page

యాదవ సత్రానికి పదెకరాలు ఇవ్వండి

Sep 29 2017 2:33 AM | Updated on Sep 29 2017 2:33 AM

Yadav Samithi Requests 10 Acres for Yadava's Satram

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమలలో సన్నిధి గొల్ల శరబయ్య పేరుతో యాదవ సత్రం నిర్మాణానికి పదెకరాల స్థలం మంజూరు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి కోరింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ పుట్ట సుధాకర్‌ యాదవ్‌ను యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు రాగం సతీశ్‌ యాదవ్‌ గురువారం కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సత్రం నిర్మిస్తే యాదవులందరికీ ఉపయోగపడుతుందన్నారు. దీనిపై టీటీడీ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పొట్ట మల్లికార్జున్‌ యాదవ్, గడ్డం సతీశ్‌ యాదవ్, రవిక్రాంత్‌ తిరుపతి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement