మహిళా పోలీసులను నిర్భంధించిన చింతమనేని అనుచరులు

Women Constables Are Predicted By Chinthamaneni Followers In West Godavari  - Sakshi

సాక్షి, ఏలూరు టౌన్‌ : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం అరెస్ట్‌ చేసే సందర్భం లో చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిసు న్న మహిళా కానిస్టేబుళ్లను కొందరు నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించి, బెదిరిం పులకు పాల్పడ్డారు. దీనిపై మహిళా కానిస్టేబు ల్‌ గుమ్మడి మేరీ గ్రేస్‌ ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యిం ది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు డీఎస్పీ దిలిప్‌కిరణ్‌ ఆధ్వర్యంలో చింతమనేని వర్గీ యులు నలుగురిని త్రీటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు మహిళా పోలీసులను అక్కడ కొందరు చింతమనేని వర్గీయులు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారని, గేటుకు తాళాలు వేసి, విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.

ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరైతే ఉంటారో వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో క్రైం నెంబర్‌ 291/19తో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో జెడ్పీలో పనిచేస్తున్న దుగ్గిరాల గ్రామానికి చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేంపాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్యను అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు హాజరుపరిచారు. వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

టీడీపీ ప్రజాప్రతినిధుల హడావుడి
చింతమనేని అనుచరులు నలుగురుని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు బడేటి కోటరామారావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను ఏలూరులోని త్రీటౌన్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. అప్పటికే అరెస్టు కాబడి స్టేషన్‌లో ఉన్న వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటూ బీరాలు పలికారు. కార్యకర్తల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి వచ్చామని, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top