
సాక్షి,తాడేపల్లి: జనసేన గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్‌ఎంపీ డాక్టర్),సతీష్‌లకు.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్త అని సూచించారు.
గతరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గిరిధర్,సతీష్‌లపై జనసేన గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వైఎస్సార్‌సీపీ కార్యాకర్తలపై దాడి గురించి సమాచారం అందుకున్న వైఎస్ జగన్ వారిని ఫోన్‌లో పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
తనని కులం పేరుతో దూషించి కొట్టారని, షాపును ధ్వంసం చేశారంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు సతీష్ చెప్పుకున్నారు. దాడిపై ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. దాడి ఘటన చాలా బాధ కలిగించింది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం బాధాకరం. వాళ్లు చేయకూడని తప్పులు చేస్తున్నారు. మనకు టైం వస్తుంది.. మంచి జరుగుతుందని’వ్యాఖ్యానించారు.