దళితులు స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు: చెవిరెడ్డి

Why Are TDP Leaders Scared Of Re polling, says chevireddy - Sakshi

సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ సందర్భంగా తొలిసారి దళితులు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న వెంకట రామాపురంలో మూడు దశాబ్దాలుగా దళితులు ఓటు వేసే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఒకరోజు ముందు రెండుచోట్ల రీపోలింగ్‌ ఇవ్వడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. ఇక అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో జరుగుతున్న రీపోలింగ్‌పై టీడీపీ ఎందుకు భయపడుతుందని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రీ పోలింగ్‌ సందర్భంగా ఆయన పోలింగ్‌ బూత్‌ల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top