చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదు? | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 20 2018 10:58 AM

Why AP CM Chandrababu Naidu Not Going To Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష అంశం తెరపైకి రావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవిశ్వాసంపైనే చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఎవరు ఏం మాట్లాడుతారు.. ఏ పార్టీ అవిశ్వాసానికి మద్దతిస్తుంది. తటస్థంగా ఏ పార్టీ ఉంటుందని దేశ ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదని అనే అంశం చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన టీడీపీ అధినాయకుడే ఢిల్లీకి వెళ్లకుండా ముఖం చాటేయడంపై ఆ పార్టీలోనే పలు అనుమానాలకు తావిస్తోంది.

తమ అధినేత ఎందుకు ఢిల్లీకి రాలేదని, ఆ పార్టీ ఎంపీలే చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన అవిశ్వాసాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో చక్రం తిప్పే చంద్రబాబు అమరావతికే ఎందుకు పరిమితమయ్యారని.. అవిశ్వాసాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గత సెషన్‌లో పార్లమెంట్‌ ముందు ఫొటోలకు ఫోజిచ్చి.. హడావుడి చేసిన చంద్రబాబు ఈ సారి సమావేశాలకు కనీసం అటువైపు చూడకపోవడం గమనార్హం. ఢిల్లీకి వెళ్లి పలు పార్టీల మద్దతు కోరాల్సిన సీఎం ఇక్కడే ఉండటం లోపాయికారి ఒప్పందమేనని పలువురి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రులతో సీఎం సమావేశం..
మరికొద్దీ సేపట్లో  సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. అవిశ్వాసం పరిణామాలు, తదుపరి వ్యూహాలపై మంత్రులు, ముఖ్యనేతలతో సీఎం చర్చించనున్నారు.

Advertisement
Advertisement