కేసీఆర్‌ అంటే చంద్రబాబుకు...! | Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘మా వాళ్లు బ్రీఫుడు మీ’ అన్న మాటలు దేశమంతా విన్నది

Apr 9 2019 1:45 PM | Updated on Apr 9 2019 4:17 PM

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పక్క రాష్ట్రం సీఎం పేరు తలుచుకుంటేనే చంద్రబాబు నాయుడికి నిద్రపట్టడం లేదని, ‘మా వాళ్లు బ్రీఫుడు మీ’ అన్న చంద్రబాబు మాటల్ని దేశమంతా విన్నదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ట్విటర్‌ వేదికగా.. చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘పక్క రాష్ట్రం సీఎం కలలోకి వస్తే నిద్రపట్టని భయం మీది చంద్రబాబూ. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగవు. ‘మా వాళ్లు బ్రీఫుడు మీ’ అన్న మాటల్ని దేశమంతా విన్నది. 18 కేసుల్లో స్టేలు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా కేసీఆర్‌తో రాజీ యత్నాలు చేసినోడివి. బతుకంతా మేనేజ్‌మెంటే కదా?’  అని విమర్శించారు.

‘జాతీయ మీడియా సర్వేల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ 120 పైగా అసెంబ్లీ స్థానాలు, 23 లోక్ సభ సీట్లు గెలుస్తుందని అనేక సార్లు వెల్లడైంది. 6 నెలలుగా జరిపిన 30కి పైగా సర్వేల్లో ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు అను’కుల’ మీడియా చంద్రబాబుదే గెలుపని దొంగ సర్వేలను వదుల్తున్నాయి.’ అని మరో ట్వీట్‌లో ధ్వజమెత్తారు.

‘మీరు చక్రం తిప్పి ప్రధాని పీఠం ఎక్కించిన దేవేగౌడ ఆల్మట్టి ఎత్తు పెంచి కృష్ణా జలాలు దక్కకుండా ఏపీ ప్రజల నోట్లో మన్ను కొట్టారు. అదే దేవేగౌడను పక్కన పెట్టుకుని ‘నేను పోతే పోలవరం గతేమిటం’టూ దొంగ ఏడుపులతో తెగ నటించేస్తున్నారు. జీవనాడి వంటి పోలవరంను ఏటీఎంగా మార్చుకున్న దొంగ మీరు.’ అని ఇంకో ట్వీట్‌లో మండిపడ్డారు. ‘మా ఎమ్మెల్యే అభ్యర్ధులు మిమ్మల్ని పీల్చిపిప్పిచేశారు. నిజమే. జన్మభూమి దొంగలు మీ నోటి దగ్గర కూడు లాగేసిందీ నిజమే. అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను చూసి ఓటేయండి అంటూ రాబందుల రాజు జాలిగా ప్రజలను ప్రాధేయపడుతున్నాడు. దయతలచి ఓటు వేస్తే డ్రాకులా మాదిరి మళ్ళీ విషపు కోరలు చూపిస్తాడు.’ అని చంద్రబాబునుద్దేశించి పరోక్షంగా కామెంట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement