మేనల్లుడిని స్వాగతించిన మేనత్త | Vasundhara Raje Welcomes Jyotiraditya Scindia Joins In BJP | Sakshi
Sakshi News home page

మా అమ్మ ఉంటే ఎంతో గర్వించేంది : రాజే

Mar 11 2020 7:23 PM | Updated on Mar 11 2020 7:24 PM

Vasundhara Raje Welcomes Jyotiraditya Scindia Joins In BJP - Sakshi

వసుంధర రాజే-సింధియా (ఫైల్‌ఫోటో)

జైపూర్‌ : కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన స్వభావం, బలం, ధైర్యాన్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని రాజే తెలిపారు. కాగా జ్యోతిరాదిత్య సింధియాకు వసుంధర స్వయానా మేనత్త అన్న విషయం తెలిసిందే. బుధవారం జేడీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరిన అనంతరం ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘మా అమ్మ (రాజమాత విజయ రాజే సింధియా) ఆరోజు ఉండి ఉంటే ఈ ఆనందక్షణాలను చూసి ఎంతో గర్వించేంది’ అని వ్యాఖ్యానించారు. చివరికి ఇద్దరం ఒకే పార్టీలో ఉండటం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. మరో మేనత్త, మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సైతం సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ తన నిర్ణయాన్ని స్వాగతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement