గుడివాడ టీడీపీలో భగ్గుమన్న సెగలు | Vangaveeti Ranga Fans Get Upset with TDP Over Devineni Avinash As MLA | Sakshi
Sakshi News home page

గుడివాడ టీడీపీలో భగ్గుమన్న సెగలు

Mar 18 2019 8:21 PM | Updated on Mar 18 2019 8:53 PM

Vangaveeti Ranga Fans Get Upset with TDP Over Devineni Avinash As MLA - Sakshi

గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను నిర్ణయించడంతో.. ఆ పార్టీలో ఉన్న వంగవీటి మోహన రంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాక్షి, కృష్ణా : గుడివాడ టీడీపీలో నిరసన సెగలు భగ్గుమన్నాయి. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను నిర్ణయించడంతో.. ఆ పార్టీలో ఉన్న వంగవీటి మోహన రంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తీరును నిరసిస్తూ గుడివాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో 200 మంది రంగా అభిమానులు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాగా వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, ఆయన సోదరుడు నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర.. రంగా విగ్రహం వద్ద ఇటీవల దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రంగా హత్యకు కారణమైన తెలుగుదేశంలో రాధాకృష్ణ చేరడం చాలా బాధకరమని, ఆయన నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు గురయ్యారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో రంగా అభిమానులంతా క్షోభకు గురువుతున్నారన్నారు. ఇక విజయవాడలో నాలుగు దశాబ్ధాల క్రితం వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు సాగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement