హెడ్‌సెట్‌ విసిరితే గాయం అవుతుందా?

v hanumantharao hot coments on headset injury - Sakshi

 న్యూఢిల్లీ: ‘హెడ్‌సెట్‌ విసిరితే కంటికి గాయం అయ్యే పరిస్థితి ఎక్కడైనా ఉందా..?’అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ వల్ల, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజజీవితంలోనే కేసీఆర్‌ సినిమా చూపిస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ ఆడుతున్న నాటకాలను ప్రజలు విశ్వసించరు. కేసీఆర్‌ ఇన్ని నాటకాలు ఆడతాడని ముందే తెలిసుంటే యూత్‌కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్‌ మెడలు వంచేవాడిన’ని వీహెచ్‌ తెలిప.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top