కష్టపడితే విజయం కాంగ్రెస్‌దే

Uttam Kumar Reddy And RC Kuntia Starts Padayatra Today In Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్‌ కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే ఎన్నికల్లో విజయం తథ్యమని కాంగ్రెస్‌ వ్యవహారా ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. హైదరాబాద్‌ నగరంలో అత్యధిక స్ధానాల్లో  విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బీజేపీ– ఎంఐఎం లక్ష్యం ఒక్కటేనని, మతతత్వమే  వారి ప్రధాన ఎజెండా ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లోని ఇందిరా భవన్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ఆయన  ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇటూ మజ్లిస్‌తో దోస్తీ కట్టి అటూ బీజేపీతో టచ్‌లో ఉందని ఆరోపించారు. నరేంద్ర మోదీ డైరెక్షన్‌ తోనే ముందస్తు ఎన్నికలని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్‌ఎస్‌ దోస్తీ కట్టడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే బీజేపీకి వేసినట్లే అన్నారు. 

వీధి పోరాటాలకు సిద్దం  
మోసాల టీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టేందుకు ప్రజా స్వామ పద్ధతిలో వీధి పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  గాంధీభవన్‌  చుట్టు తిరగవద్దని, సమయం తక్కువగా ఉంది..నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి కేసీఆర్‌  హటావో – తెలంగాణ బచావో అనే నినాదంలో విస్తృతంగా టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కేసీఆర్‌ బట్టేబాజ్‌ నెంబర్‌వన్‌ అని గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ అభివర్ణించారు.  సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అబీద్‌ రసూల్‌ ఖాన్, నిరంజన్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పాదయాత్ర
నగరంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార పర్వాన్ని శనివారం ఉదయం 8.30 గంటలకు మహంకాళి అమ్మవారి దేవాలయంలో  ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సెక్రటరి కుంతియా, ఇన్‌చార్జి సెక్రటరి ఎన్‌.ఎస్‌.బోస్‌రాజు, టీపీసీసీ చీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పూజలుచేసి ప్రారంభిస్తారని  నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌లు తెలిపారు. పూజల అనంతరం ఖైరతాబాద్‌ డివిజన్‌లోని బిజెఆర్‌నగర్, మహాభారత్‌నగర్, మారుతీనగర్‌ తదితర బస్తీలలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top