చేనేత కార్మికులకు అండగా ఉంటాం

Uttam Kumar Reddy all-party meeting of handloom workers - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పోచంపల్లి కార్మికుల డిమాండ్లు మహాకూటమి ఎజెండాలో పెడతాం

పోచంపల్లిలో చేనేత కార్మికుల దీక్ష విరమణ

సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, టీజేఎస్‌ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్‌ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు.

భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్‌ఎస్‌ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్‌ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్‌ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్‌ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top