లారీల సమ్మెను విరమింపజేయండి: ఉత్తమ్

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీ యజమానులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే లారీ యాజమాన్యాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలన్న డిమాండ్ సహేతుక మేనని అభిప్రాయపడ్డారు.
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ యూపీఏ హయాంలో రూ.18 వేలుంటే, ఇప్పుడు రూ.47 వేలకు పెంచారన్నారు. జాతీయ రహదారులపై టోల్ భారం అధికంగా ఉందని, టోల్ ఫ్రీ రవాణాకు అనుమతించాలన్న లారీ యజమానుల డిమాండ్‌ను పరిశీలించాలని కోరారు. తెలంగాణ, ఏపీల్లో ఎక్కడ రోడ్ టాక్స్ చెల్లించినా రెండు రాష్ట్రాల్లో వర్తించేలా చూడాలని, ఇరు రాష్ట్రాల మధ్య చెక్‌పోస్టులను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని లారీల సమ్మెను విరమింపజేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి