స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ

Union Minister Gadkari collapses midst of his speech in Maharashtra - Sakshi

షిర్డీ:  నాగ్‌పూర్‌ ఎంపీగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్ధి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షిర్డీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన స్టేజీపైనే సొమ్మసిల్లారు. షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం శివసేన అభ్యర్థి సదాశివ్‌ లొఖాండే తరఫున శనివారం సాయంత్రం రహతాలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసంగం పూర్తి చేసి కుర్చీలో కూర్చోబోతూ సొమ్మసిల్లారు. భద్రతా సిబ్బంది, నేతలు కిందకు పడిపోకుండా పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆయన తన కారు వద్దకు ఎవరి సాయం లేకుండానే నడిచి వెళ్లారు. అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top