ఉద్యోగ కల్పన ఊసే లేదు : రాహుల్‌ గాంధీ

Union Budget 2020: Rahul Gandhi dismisses Modi Govt Budget - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ బడ్జెట్‌లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని పెదవి విరిచారు. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

(చదవండి : బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి)

పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని మండిపడ్డారు.‘దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌తో తెలిసిపోయింది’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. 

(చదవండి : బడ్జెట్‌లో ఈ రంగాల ఊసే లేదు)

కాగా 2020-21బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. 

చదవండి : 
డిపాజిట్‌ దారులకు గుడ్‌ న్యూస్‌

డిగ్రీ స్థాయిలోనే ఆన్‌లైన్‌ కోర్సులు

కొత్తగా 5 స్మార్ట్‌ నగరాలు​​​​​​​

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top