రంగులేసుకుని బతికిన రేవంత్‌కు వేల కోట్లా? | trs leader k laxma reddy slams revanth reddy | Sakshi
Sakshi News home page

రంగులేసుకుని బతికిన రేవంత్‌కు వేల కోట్లా?

Dec 21 2017 4:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

trs leader k laxma reddy slams revanth reddy - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబడ్దార్‌ అని టీఆర్‌ఎస్‌ నేతలు సి. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డిలు హెచ్చరించారు.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబడ్దార్‌ అని టీఆర్‌ఎస్‌ నేతలు సి. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డిలు హెచ్చరించారు. వారిక్కడ గురువారం మాట్లాడుతూ జడ్చర్లలో జనగర్జన పేరిట కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహిస్తే 3 వేల మంది కూడా హాజరు కాలేదన్నారు. ఆ పార్టీలో రేవంత్‌ రెడ్డి జోకర్‌ గా మారారని ఎద్దేవా చేశారు. గోడల మీద రంగులు వేసి బతికిన రేవంత్‌కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు.

కాగా, జడ్చర్లలో బుధవారం జరిగిన సభలో మంత్రి సి. లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్‌..  మున్నాభాయ్‌, ఆర్‌ఎంపీ డాక్టర్‌ అంటూ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement