పేదల పక్షపాతి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 

TRS Government was poor's government

కుల వృత్తులకు పూర్వ వైభవం: మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేట, చిన్నకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదలు కొంతకాలంగా నివాసముంటున్న గృహాలకు జీఓ నం.58, 59 ద్వారా సీఎం కేసీఆర్‌ సర్వహక్కులు కల్పించిన విషయం గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేద వధూవరులకు వరంగా నిలుస్తున్నాయన్నారు. గొర్రెల పంపిణీ పథకం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

డబుల్‌ బెడ్రూం పథకం గూడు లేని నిరుపేదలకు ఉపయోగపడుతోందని తెలిపారు.  అనంతరం సిద్దిపేటలోని పలువురికి జీఓ 59 కింద పట్టాలు అందించారు. పలు గ్రామాల బీజేపీ నాయకులు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చిన్నకోడూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్, కార్పొరేషన్‌ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top