కమల్, రజనీలకు రాజకీయ కళ్లెం

TN Government Restrictions on school students - Sakshi

కాలేజీల్లో రాజకీయ ప్రసంగాలుచేయరాదని ఉత్తర్వులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై11 ఆంక్షలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థులే లక్ష్యంగా నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌ చేస్తున్న ప్రసంగాలకు రాజకీయకళ్లెం పడింది. కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించరాదంటూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగుచూశాయి.

వెండితెరపై యువతను ఉర్రూతలూగించిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. నటులు రజనీకాంత్‌ ఇటీవల శ్రీరామచంద్ర వైద్యకళాశాలలో ఎంజీ రామచంద్రన్‌ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం బహిరంగసభావేదికపై ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. అలాగే ఇటీవల కాలంలో అనేక ప్రయివేటు, ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలు తమ వార్షికోత్సవ వేడుకలకు నటీనటులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాయి. వారంతా సహజంగానే విద్యార్థులను ఉద్దేశించి రాజకీయ చైతన్య ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా కమల్‌హాసన్‌ ఇటీవలే తాను ప్రారంభించిన రాజకీయ పార్టీ, లక్ష్యాల గురించి ప్రసంగిస్తూ వస్తున్నారు. కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులకు స్పందించిన కాలేజీ విద్య సంచాలకులు మంజుల రాష్ట్రంలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు గత నెల 25న ఒక సర్క్యులర్‌ జారీచేశారు. కళాశాలల్లో జరిగే కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యే నేతలు రాజకీయాలను ప్రస్తావించరాదని, అలాంటి కార్యక్రమాలను అనుమతించరాదని పేర్కొంటూ ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కాలేజీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు తమ పార్టీ లక్ష్యాలను ప్రస్తావించడం, విద్యార్థుల్లో ప్రచారం చేయడం, అనేక రాజకీయ అంశాలపై చర్చలు జరపడం వంటివి తావివ్వరాదని స్పష్టం చేసింది.

పాఠశాల విద్యార్థులపై ఆంక్షలు: ఇదిలా ఉండగా, ప్రభుత్వపాఠశాలల విద్యార్థులపై కొత్తగా 11 ఆంక్షలు విధిస్తూ విద్యాశాఖ సంచాలకులు గురువారం ఆదేశాలు జారీ చేశారు.         
జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి 1, 6, 9, ప్లస్‌ ఒన్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రకారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వేరుగా గుర్తించేలా నాలుగు ప్రత్యేకరంగులతో యూనిఫారాలను రూపొందించి సిద్ధం చేశారు. ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులు గోచరించాలని విద్యాశాఖ ఆశిస్తోంది. అయితే పాఠశాలల విద్యార్థులు కాలేజీ విద్యార్థులతో సమానంగా బుర్రమీసాలు, చెవులకు కమ్మలు, లోహిప్‌ ప్యాంట్, భిన్నమైన రీతిలో హెయిర్‌ కటింగ్‌లతో రావడాన్ని అధికారులు గుర్తించారు. అంతేగాక పాఠశాలల్లో యథేచ్ఛగా స్మార్‌ ఫోన్ల వినియోగం కూడా ఎక్కువైందని తెలుసుకున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు 11 ఆంక్షలను రూపొందించారు.

ఉదయం 9.15 గంటల్లోగా పాఠశాలకు రావాలి. లోహిప్, టైట్‌ ప్యాంటులు వేసుకుని రాకూడదు. సా«ధారణ ప్యాంట్‌పై వదులుగా ఉంటే హాఫ్‌షర్ట్‌ మాత్రమే వేసుకోవాలి. టైట్‌ షర్ట్‌ వేసుకోరాదు. చేసుకున్న ఇన్‌షర్ట్‌ బైటకు రాకూడదు. నల్లని బకిల్‌ ఉన్న బెల్టును మాత్రమే వినియోగించాలి. చేతులు, కాళ్లకు పొడవుగా గోళ్లు పెంచుకోరాదు. పోలీస్‌ కటింగ్‌ను పోలినట్లుగా క్రాఫ్‌ ఉండాలి. పై పెదవికి సమానంగా మీసం ఉండాలి. బుర్రమీసాలు పెంచితే చర్య తప్పదు. చేతికి రబ్బర్‌బ్యాండ్, తాడు, చెయిన్, చెవులకు కమ్మలు ఉండకూడదు. తల్లిదండ్రుల సంతకంతో కూడిన ఉత్తరం ద్వారా మాత్రమే సెలవు తీసుకోవాలి. బైక్, సెల్‌ఫోన్, స్టార్ట్‌ఫోన్‌లకుఅనుమతిలేదు.ధిక్కరిస్తేవాటినిశాశ్వతంగాస్వాధీనంచేసుకుంటాం.జన్మదినంరోజుల్లోసైతంయూనిఫారంలలోనేస్కూలుకురావాలి.  విద్యార్థులు ఈ ఆంక్షలను విధిగా ఆచరించాలని హెచ్చరించారు. అలాగే ఆంక్షలతో కూడిన ఫ్లెక్సీలను అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని, కరపత్రాల ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

రాజకీయపార్టీల గొంతునొక్కడమే: వైగో
అయితే ఈ ఉత్తర్వులను ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది యువకులను చైతన్యవంతులను చేయకుండా రాజకీయ పార్టీల గొంతునొక్కడమేనని విమర్శించారు. పెరియార్, అన్నాదురై, కామరాజనాడార్, కరుణానిధి  కాలేజీల్లో ప్రసంగాలు చేసి యువతలో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. కళాశాలల్లో రాజకీయాలు మాట్లాడరాదనే నిబంధనలు బ్రిటీష్‌ పాలనలో కూడా లేవని ఆయన  ఎద్దేవా చేశారు. దుర్బుద్ధితో చేసిన ఉత్తర్వులను అన్నాడీఎంకే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top