పొత్తులు సరే.. ఆకాంక్షల సాధన ఎలా?

TJS focusing on poll alliances - Sakshi

టీజేఎస్‌ జిల్లా ఇన్‌చార్జిలతో కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలకన్నా టీజేఎస్‌పైనే ఎక్కువగా ఉంటుం దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జిలు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలతో సమావేశమైన కోదండరాం.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యమ ఆకాం క్షలపై చర్చించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో పొత్తులకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పొత్తుల వల్ల తలెత్తబోయే సమస్యలను ప్రస్తావించారు. ఆకాంక్షలను కాపాడుకోడానికి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top