‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’ | Thota Vani Denies News Quitting YSR Congress Party | Sakshi
Sakshi News home page

పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం : తోట వాణి

Jul 16 2019 10:01 AM | Updated on Jul 16 2019 10:14 AM

Thota Vani Denies News Quitting YSR Congress Party - Sakshi

వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు.

సాక్షి, తూర్పుగోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. తప్పుడు అఫివిడవిట్‌తో చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని తోటవాణి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

(చదవండి : తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన చినరాజప్ప)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement