
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ విడతలో అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీ కుంట, మహబూబ్‌నగర్, మూసాపేట, హన్వాడ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ స్థానాలకు 30మంది, ఎంపీటీసీ స్థానాలకు 288మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రచార పర్వం ముగియగానే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు, మద్యంతో పోలింగ్‌కు ముందు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
437 పోలింగ్‌స్టేషన్లు..
రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 437 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చే శారు. ఇందులో అత్యధికంగా దేవరకద్రం లో 80 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కో యిల్‌కొండలో 79, సీసీ కుంటలో 67, హ న్వాడలో 65, మహబూబ్‌నగర్‌లో 65, మూసాపేటలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏడు మండలాల్లో కలిపి మొత్తం 2,30,383 ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 44,959 ఓ టర్లు, అత్యల్పంగా ముసాపేటలో 19,852 మంది, అడ్డాకులలో 22,339 మంది, సీసీకుంటలో 33,677మంది, దేవరకద్రలో 41,884మంది, హన్వాడలో 35,160మంది, మహబూబ్‌నగర్ రూరల్‌లో 32,512 మంది ఓటర్లు ఉన్నారు.
62 సమస్యాత్మక కేంద్రాలు
రెండో విడతలో ఎన్నికల్లో 16 సమస్యాత్మక గ్రామాలతో పాటు 62 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తిం చారు. సమస్యాత్మక కేంద్రాల్లో అత్యధికం గా సీసీ కుంటలో 23, హన్వాడలో 14, దే వరకద్రలో 13, అడ్డాకలలో 10, కోయిల్‌కొండలో 3 సమస్మాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. మహబూబ్‌నగర్, ముసాపేట మండలాల్లో ఎలాంటి సమస్యాత్మ గ్రామాలు, పోలింగ్‌స్టేషన్లు లేవు. సమస్యాత్మక గ్రామాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం ఎన్నికల సరళీని పరిశీలించి ఉన్నతా«ధికారులకు పరిస్థితిని చేరవేస్తుంటారు.
2,581 పోలింగ్ సిబ్బంది
రెండో విడత కోసం మొత్తం 2581 పోలిం గ్ సిబ్బందిని ఎంపిక చేశారు. వారికి ఇది వరకే పోలింగ్ శిక్షణ ను ఇచ్చారు. ఇం దులో పీఓలు 437, ఏపీఓలు 437 మంది ఉం టారు. 1,707 సి బ్బందితో పాటు అదనంగా 12శాతం మందిని రిజర్వ్‌లో పెట్టారు. అత్యవసర సమయంలో వారిని ఉపయోగించుకోనున్నారు.