‘వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి’

TDP Leaders Attacked On YSRCP Polling Agent Hut In Madakasira - Sakshi

సాక్షి, అనంతపురం : మడకశిర నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరాపురం మండలం హుదుగూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌ గుడిసెకు నిప్పంటించి రాక్షసానందం పొందారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న మహిళ శశికళను స్థానికులు రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా మద్దనకుంటలో కూడా టీడీపీ నేతలు దళితులపై దౌర్జన్యానికి దిగడంతో ఎస్పీ అశోక్‌ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు మడకశిర వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి డాక్టర్‌ తిప్పేస్వామి తెలిపారు.

మా గెలుపును జీర్ణించుకోలేకే..
ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలవబోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని తిప్వేస్వామి అన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటామని.. వారి హింసా రాజకీయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. మీకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top