‘నర్రా’కు పదవి ఇస్తారా ? లేదా ?

tdp Activists ask to ayyanna pathrudu post for narra balakrishna - Sakshi

పెదనందిపాడులో మంత్రి అయ్యన్నపాత్రుడు  నిలదీసిన టీడీపీ కార్యకర్తలు

తన చేతిలో ఏమీ లేదన్న మంత్రి  

లిఫ్టు ఇరిగేషన్‌ ప్రారంభోత్సవానికి వెళ్లని తెలుగు తమ్ముళ్లు

గుంటూరు, పెదనందిపాడు: రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు నర్రా బాలకృష్ణకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ పదవి ఇస్తారో చెప్పే వరకు కదలనివ్వబోమని అడ్డుకున్నారు. మంగళవారం పెదనందిపాడులో టీడీపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో తాము ఒట్లు వేసి గెలిపించింది ఇందుకోసమేనా అంటూ మంత్రిని నిలదీశారు.

తన చేతుల్లో ఏమీ లేదని, పార్టీ ఆధిష్టానంతో చర్చించి చెబుతానని మంత్రి సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లను పక్కకు నెట్టేసి మంత్రిని పంపించారు. ఆగ్రహించిన కార్యకర్తలు లిఫ్టు ఇరిగేషన్‌ ప్రారంభోత్సావానికి వెళ్లకుంగా మిన్నకుండిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top