టీబీజీకేఎస్‌ నేత రాజీనామా? 

TBGKS Leader Kengarla Mallaiah Likely To Quit Union - Sakshi

నేడు అధికారిక ప్రకటన

త్వరలో కేంద్ర మంత్రుల సమక్షంలో బీఎంఎస్‌లో చేరిక

టీఆర్‌ఎస్‌ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘానికి షాక్‌

గోదావరిఖని : టీఆర్‌ఎస్‌ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగెర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. టీబీజీకేఎస్‌లో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నెలాఖరులో కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీఎంఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుబంధంగా 2003లో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్‌లో ఆది నుంచి పనిచేస్తున్న మల్లయ్య అనేక కీలక పదవుల్లో పనిచేశారు. యూనియన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటు ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీబీజీకేఎస్‌లో ఉంటే గుర్తింపు లేదనే ఆలోచనతో మల్లయ్య బీఎంఎస్‌ వైపు దృష్టి సారించారు. అయితే బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top