పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా! | Sushmita Patel in race from warangal east | Sakshi
Sakshi News home page

పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా!

Sep 11 2018 2:52 AM | Updated on Sep 11 2018 8:39 AM

Sushmita Patel in race from warangal east - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్‌ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్‌ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పినట్లు తెలిసింది. సోమవారం కొండా దంపతులు హన్మకొండకు వచ్చారు. వరంగల్‌ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్‌రావు సమావేశమయ్యారు. మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది.
 
నేడు బహిరంగ లేఖ!
ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో ఈ లేఖను విడుదల చేయనున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement