మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్‌! | Somireddy Chandramohan Reddy brother joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన సోమిరెడ్డి సోదరుడు

Feb 24 2019 2:23 PM | Updated on Feb 24 2019 3:49 PM

Somireddy Chandramohan Reddy brother joins YSRCP - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీతో పాటు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సుధాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అవినీతి...అక్రమాలు సహించలేకే పలువురు టీడీపీని వీడుతున్నారని అన్నారు. కాగా ఇప్పటికే సోమిరెడ్డికి  స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరిన విషయం విదితమే.

మరోవైపు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే  నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో రామతీర్థం మాజీ శివాలయం చైర్మన్‌ శ్రీనివాసులు, కరుణాకర్‌, మురళితో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement