‘సిట్‌ నివేదికను బహిర్గతం చేయాలి​’

SIT report should Be disclosed - Sakshi

సాక్షి, విశాఖ: భూముల కబ్జాపై ప్రభుత్వానికి అందించిన సిట్‌ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌. నర్సింగరావు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిట్‌ నివేదిక అందించి ఆరు నెలలు అయినా బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలు కలుగుజేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్‌, పరుచూరి భాస్కరరావులు రికార్డుల ట్యాంపరింగ్‌లకు పాల్పడినా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్టు చేసిన కొద్ది మంతిని విడుదల చేయడం ప్రభుత్వపు దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. కబ్జాకు గురైన భూముల్లో ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం స్వాదీనం చేసుకోలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయనే భయంతోనే నివేదికను బహిర్గతం చేయడంలేదని నర్సింగరావు ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top