కాంగ్రెస్‌ నాయకులే టార్గెట్‌ : షబ్బీర్‌ | Shabbir Ali Slams TRS Leaders In Hyderabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకులే టార్గెట్‌ : షబ్బీర్‌

Sep 27 2018 3:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

Shabbir Ali Slams TRS Leaders In Hyderabad - Sakshi

షబ్బీర్‌ అలీ

ఆ పథకంలో భాగంగానే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పాసుపోర్టు కేసులో ఇరికించారని ఆరోపించారు.

హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను టార్గెట్‌ చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ సారి ఎన్నికల్లో గెలవడం కోసం నెల రోజుల ముందే పథకం రచించారని వెల్లడించారు. ఆ పథకంలో భాగంగానే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పాసుపోర్టు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసి ఆయన, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి కేసులు, సోదాలకు కాంగ్రెస్‌ పార్టీ భయపడదని చెప్పారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. నా ఫోన్‌, కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లు కూడా టాప్‌ చేశారని వెల్లడించారు. దీనిపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. మాపై కూడా కేసులు పెడతారనే సమాచారం ఉందని, మేము ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement