
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలుగా, పార్లమెంటరీ సెక్రటరీలుగా రెండు లాభదాయక పదవుల్లో జీతాలు తీసుకున్న ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రితో కలిపి 18 మంది కేబినెట్ మంత్రులతో పాటు అదనంగా 21 మందికి కేబినెట్ హోదా ఇచ్చిందని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్లమెంటరీ కార్యదర్శులుగా పనిచేసిన ఆరుగురు ఎమ్మెల్యేల (వినయ్ భాస్కర్, సతీశ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, కోవా లక్ష్మి, గ్యాద రి కిశోర్ కుమార్, జలగం వెంకట్రావు)ను తక్షణమే ఎమ్మె ల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఇప్పటిదాకా రెండు పదవులకు పొందిన ప్రయోజనాలను రికవరీ చేయాలన్నారు. వీరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, కోర్టులోనూ పోరాడతామన్నారు.