పరిటాల సునీతకు షాక్‌

Setback To Paritala Sunitha In Rapthadu - Sakshi

సాక్షి, అనంతపురం/కడప: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. (కాంగ్రెస్ టీడీపీల మధ్య సీక్రెట్‌ బట్టబయలు..)

నలపరెడ్డి రాజీనామా
అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, సునీత తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నలపరెడ్డి ఆరోపించారు. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. (‘కాల్వ’కు ఎదురుదెబ్బ!)

టీడీపీకి బాలకొండయ్య గుడ్‌బై
వైఎస్సార్ జిల్లా కడప టీడీపీలోనూ అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. జిల్లా టీడీపీ నాయకత్వ తీరు నచ్చక ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఓర్సు బాలకొండయ్య నేడు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో నాయకుల దగ్గర నీతితో కూడిన విలువలు లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. (అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top