టీడీపీకి యామిని గుడ్‌ బై! | Sadineni Yamini Likely To Be Join BJP | Sakshi
Sakshi News home page

టీడీపీకి సాధినేని యామిని గుడ్‌ బై!

Aug 18 2019 2:14 PM | Updated on Aug 18 2019 2:18 PM

Sadineni Yamini Likely To Be Join BJP - Sakshi

సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.  ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

గత ఎన్నికల సమయంలో సాధినేని యామిని సోషల్‌ మీడియాలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement