జగన్‌ ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల హర్షం | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 1:06 PM

 RTC employees Thank YS Jagan For His Comments On RTC Merger into Government - Sakshi

సాక్షి, చిత్తూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 54వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం వైఎస్‌ జగన్‌ను ఆర్టీసీ కార్మికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో కార్మికులకు భరోసా, భద్రత లభిస్తాయని ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 53వ రోజు శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ‘దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తా’నని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

శనివారం 54వరోజు పాదయాత్రను గొడ్లవారిపల్లి శివారు నుంచి ప్రారంభించిన వైఎస్‌ జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు నీరాజనం పలికారు. పాదయాత్రలో జననేతను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. పీఆర్సీ బకాయిలు, రెండు డీఏలు చెల్లించలేదని తమ ఆవేదనను వ్యక్తం చేయగా వారికి భరోసాను కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదలారు. వైఎస్‌ జగన్‌ను స్థానిక సంస్థల ఎన్నికల ప్రతినిధులు కూడా కలిసారు. జన్మభూమి కమిటీలతో సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని తెలిపారు. జన్మభూమి కమిటీలను రద్దు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. బీడీ కార్మికులు సైతం జననేతతో సమావేశమయ్యారు.  పాదయాత్ర కల్లూరు చేరిన అనంతరం వైఎస్‌ జగన్‌ మైనార్టీల ఆత్మీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

Advertisement
Advertisement