ఆ పత్రికలపై ఫిర్యాదు: రేవంత్‌రెడ్డి

revanth reddy complaint to election commission - Sakshi

నమస్తే తెలంగాణ పత్రిక, టీ–న్యూస్, టీవీ– 9, 10 టీవీలు కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ను మాత్రమే చూపిస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి జాతీయ నాయకులు వచ్చినా కనీసం చూపించడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఈఓ రజత్‌కుమార్‌ను కలి సిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధికార పార్టీకి మాత్రమే ప్రచారం కల్పి స్తున్న ప్రసార మాధ్యమాలపై నిషేధం విధించాలని, వాటిని వార్త చానళ్లుగా గుర్తించరాదని ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్‌ బృం దానికి సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రగతిభవన్‌ను టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలను బుజ్జ గించడానికి కేటీఆర్‌ వాడుకుంటున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top